పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. రెడ్డి శాంతి క్యాంపు కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆమెతోపాటు నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.