నీటిలో పడిన, లేదంటే వర్షంలో తడిచిన మొబైల్ ను మొదట ఆన్‌లో ఉంటే వెంటనే దాన్ని స్విచ్ఛాఫ్ చెయ్యాలి. మొబైల్‌ని ఆపరేట్ చెయ్యకుండా స్విచ్ఛాఫ్ చెయ్యాలి. పొడి గుడ్డతో ఫోన్‌ను తుడిచి బ్యాటరీ, సిమ్ కార్డులను తీసేయాలి. ఆ తర్వాత మొబైల్ ని ఒక రోజంతా బియ్యంలో అలా ఉంచేయాలి. ఆ తర్వాత మొబైల్ తీసి మరోసారి తుడిచి బ్యాటరీ, సిమ్ వేసి ఆన్ చేసి వాడుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఫోన్ కు ఏ ఇబ్బంది రాదు.