ప్రస్తుత రోజుల్లో ఇంటర్ నెట్ లో ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా మొదటగా గుర్తొచ్చే పేరు గూగుల్. ఈ టెక్ దిగ్గజం అంతలా ఆదరణ పొందింది. అయితే గూగుల్ లో కొన్ని వెతికితే చిక్కుల్లో పడక తప్పతది నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ లో బాంబులు తయారు చేసే విధానం, ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారీ విధానం అస్సలు సెర్చ్ చేయకూడదట. అలానే పిల్లల అశ్లీల చిత్రాలు, పిల్లల లైంగిక వేధింపుల వీడియోలు సైతం గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. కిడ్నాప్ విధానం, నార్కోటిక్స్ సమాచారం, మహిళల అబార్షన్ కు సంబంధించిన సమాచారం గురించి గూగుల్ లో వెతికితే మిమ్మల్ని పోలీసులు విచారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.