పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పొదుపు చర్యలను పాటిస్తుంది. తాజాగా ఇంధన పొదుపు చర్యలను ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకే మార్కెట్లను, 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. అంతేకాకుండా ఫిబ్రవరి నుండి బల్బుల తయారీని, జులై నుండి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామని, ఇంధన పొదుపు ప్రణాళికలను తక్షణమే అమలు చేస్తామని ఆయన తెలిపారు.