దాదాపు 20 కోట్ల మంది ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. యూజర్ల ఈ-మెయిల్ ఐడీలను ఆన్ లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్లు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. దీంతో టార్గెటెడ్ ఫిషింగ్, డాక్సింగ్ జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు ఆలోన్ గాల్ చెప్పారు. తాను చూసిన అతి పెద్ద ‘డేటాలీక్స్’లో ఇది ఒకటన్నారు.