విదేశాల్లో ఉండే భారతీయులు కుటుంబాలకు నగదు పంపాలంటే దళారులకు పెద్ద మొత్తంలో కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. వీరికోసం కేంద్రం యూపీఐ సేవలను ప్రారంభించనుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపుర్, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్ వంటి దేశాల్లోని భారత ప్రజలు త్వరలోనే యూపీఐ ద్వారా కుటుంబాలకు డబ్బు పంపగలుగుతారు. ఏప్రిల్ 30కల్లా దీనికోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్‌పీసీఐ సూచించింది.