డ్రైవర్ ఉద్యోగం దొరక్క రిక్షా లాగిన వ్యక్తి క్యాబ్ కంపెనీని స్థాపించాడు. బీహార్ సహర్సా జిల్లా బన్ గావ్ కు చెందిన దిల్ ఖుష్ కుమార్ ఇంటర్ తో చదువు ఆపేసి బస్ నడుపుకుందామని ఢిల్లీ వెళ్లాడు. ఉద్యోగం దొరకకపోవడంతో రిక్షా నడిపేవాడు. తర్వాత బీహార్ కి వచ్చి కూరగాయలు అమ్మేవాడు. 2016లో తన గ్రామంలో ఆర్యగో అనే క్యాబ్ సేవల సంస్థను ప్రారంభించాడు. పాత నానోతో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 4 వేల కార్లతో నడుస్తుంది.