ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. అయితే టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ అన్ని కంపెనీల కంటే వినూత్నంగా ఆలోచించింది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఇంటెల్ తెలిపింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న ఈ తరుణంలో.. ఇంటెల్ భిన్నంగా ఆలోచించడాన్ని నిపుణులు మెచ్చుకుంటున్నారు.