ఉత్తర్ ప్రదేశ్ లో అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను ఇవాళ విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత లక్నోలోని స్పెషల్ కోర్టు కప్పన్ ను రిలీజ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. మనీల్యాండరింగ్ కేసులో అతను రెండేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన కప్పన్.. రాక్షసచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. బెయిల్ వచ్చినా జైల్లో పెట్టారని, రెండేళ్లు కఠినంగా సాగినా ఎప్పుడూ భయపడలేదన్నారు. 2020లో హత్రాస్ లో జరిగిన రేప్ ఘటనను రిపోర్ట్ చేసేందుకు వెళ్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.