భట్టిప్రోలు మండల పరిపీలోని పెదపులివర్రు పంచాయతీ శివారు గ్రామం గుత్తా వారి పాలెంలో ప్రతి సంవత్సరం జరుగు శ్రీనివాస కళ్యాణం వేద పండితులు మేడూరి శ్రీనివాస్ దీక్షితులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. తొలుత పెదపులివర్రు శివాలయం నుండి కోలాట భజన సంకీర్తన తో స్వామివారిని గుత్తా వారి పాలెం వేదిక వద్దకు ఊరేగింపు గా తీసుకువచ్చారు. అనంతరం భక్తులచే గోపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమముతో ప్రారంభించి కన్నుల పండుగగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా 21 మంది దంపతులు కళ్యాణ దంపతులుగా కూర్చున్నారు. అనంతరం భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జంపని వీరయ్య, తాడేపల్లి వెంకట బసవయ్య, మేకల శ్రీనివాసరావు, పెసర్లంక శ్రీనివాసరావు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.