దేశంలో పీజీ వైద్య విద్యార్థులు ఇకపై జిల్లాల్లోని ఆస్పత్రుల్లో పని చేయాల్సిందే. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ‘డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం’ అమలు చేయబోతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించే వారు కోర్సు ముగిసే లోపు 3 నెలలు జిల్లా ఆస్పత్రుల పరిధిలో పని చేయడాన్ని ఎన్ఎంసీ తప్పనిసరి చేసింది. అయితే, కొవిడ్ కారణంగా గతేడాది సాధ్యపడలేదు. ఈ ఏడాది నుంచి దీన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.