ఎయిర్ టెల్ తనపోస్ట్‌పెయిడ్ యూజర్లకు అన్ లిమిటెడ్ ఇటర్నేట్ డాటాను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం 5జీ వాడుతున్న కస్టమర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డేటాపై విధిస్తున్న పరిమితిని ఎత్తివేసింది. అంటే రోజులో ఎంతైనా డేటాను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం 4జీ యూజర్లకు అందిస్తున్ ప్లాన్లపై రోజువారీ డేటా పరిమితి ఉంది. అయితే, అది ఇక 5జీ కస్టమర్లకు వర్తించదు. ఇప్పటికీ రియలన్స్ జియో సైతం తమ 5జీ కస్టమర్లకు వెల్‌కమ్ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో జియో నుంచి వస్తున్న పోటీను తట్టుకుని నిలబడేందుకు ఎయిర్‌టెల్ సైతం అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. 5 జీ యూజర్లకు అందిస్తున్న అపరిమిత డేటా ప్లాన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
5జీ మొబైల్ ఫోన్ కలిగి ఉండి 5జీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న కస్టమర్లందరికీ ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే, కనీసం రూ.239 అంత కంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు సైతం ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని తెలిపింది. తమ యూజర్లు రోజువారీ డేటా పరిమితి గురించి ఆందోళన చెందకుండా ఇంటర్నెట్ సేవలన్ని వినియోగించుకోవడం, ఆన్‌లైన్ సేవల్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది ఎయిర్‌టెల్.
ప్రస్తుతం దేశంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీలు పోటా పోటీగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. 5జీ సేవలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచే వెల్‌కమ్ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటా సదుపాయాన్ని అందిస్తోంది. మరోవైపు ఇటీవలే జియో ప్లస్ పేరిట కొత్త ప్లాన్లను లాంఛ్ చేసి పోస్ట్ పెయిడ్ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్ సైతం తమ 5జీ యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ వాడుతున్న వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఈ పరిమిత 5జీ డేటా ఆఫర్ పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా నగరాల్లోని 5జీ యూజర్లందరికీ ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ వాడుకునే అవకాశం లభిస్తుంది.