లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి వివిధ మోడళ్లపై 5 శాతం వరకు ధర పెంచనుంది. రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ధరలు పెరగనున్నాయి. గత 3 నెలల వ్యవధిలో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది రెండో సారి. అక్టోబర్‌లో యూరోకు రూ.78ల విలువ ఉండేదని, అది ఇప్పుడు రూ.87కు చేరుకుందని సంస్థ తెలిపింది. రూపాయి విలువ తగ్గడంతో ధరల పెంపు తప్పడం లేదని పేర్కొంది.