పంచాంగం ప్రకారం ఈ ఏడాది మే 18 (గురువారం) శని జయంతి జరుపుకొంటున్నారు. ఆయన అనుగ్రహం పొందడానికి ఉదయాన్నే శుచిగా తయారై సూర్య దేవుడిని పూజిస్తూ రాగిపాత్రలో ఆయనకు అర్ఘ్యం సమర్పించాలి. శని దేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనె, నీలం పువ్వులు, నల్ల నువ్వులను సమర్పించండి. ‘ఓం శం శనిచారాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. శని దోషం జాతకంలో ఉంటే శనిదేవుని భక్తితో పూజిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి.