ప్రస్తుతం చాలా మందికి డయాబెటిస్ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. దీంతో వ్యాధి ముదురుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు మనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా జట్టు రాలే సమస్య, ఏ పని చేయకపోయినా అలసట చెందడం, చర్మంపై మచ్చలు, తరచూ మూత్ర విసర్జన, తీవ్ర తలనొప్పి, కొంతమందిలో చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, అరికాళ్లలో మంటలు పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.