జామ ఆకులతో జుట్టు, చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జామ ఆకు నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు తొలగించడం సహా జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తుంది. అలాగే, మొటిమలు, అలర్జీ, దద్దర్లు వంటి సమస్యలు జామ ఆకు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయంటున్నారు. అంతే కాకుండా పొడి చర్మం సమస్యను తొలిగించి చర్మాన్ని మృదువుగా చేస్తుందంటున్నారు.