రాత్రి సమయానికి భోజనం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేస్తే డయాబెటిస్ 2, గుండెజబ్బులు తలెత్తే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేస్తే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుందని అంటున్నారు. సరైన భోజనంతో పాటు సరైన నిద్ర పోవాలని పేర్కొంటున్నారు.