ఏపీలో పదో తరగతి ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ రాసేవారు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుము రూ.50తో ఈనెల 22 వరకు అవకాశం కల్పిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.