వేసవిలో చాలామంది బీర్లను ఎక్కువగా తాగుతుంటారు. అలాంటి వారు నీరు ఎక్కువగా తీసుకోవాలని, బీర్ తాగేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బీర్ తాగేటప్పుడు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివైనా, బీర్ తాగేటప్పుడు అస్సలు తీసుకోకూడదంటున్నారు. అలాగే, గుడ్లు, జున్ను బీర్ తాగేటప్పుడు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.