ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ఏపీలోని ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు మే 30వ తేదీలోగా పాఠశాలల్లో చేరాలని అధికారులు తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ నిన్నటితో ముగియగా, రెండు రోజులు గడువు పెంచారు. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. మొత్తం 25% సీట్లలో అనాథ, హెచ్ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బీసీలకు 4% సీట్లు కేటాయిస్తారు.