ఖాళీ కడుపుతో చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎండ కారణంగా వచ్చే చర్మ, డీహైడ్రేషన్ సమస్యలు సులభంగా దూరమవుతాయి. కూల్ డ్రింక్స్ బదులుగా చెరుకు రసం తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషక గుణాలు మలబద్ధకం సమస్యలను సులభంగా దూరం చేస్తాయి. అంతేకాకుండా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.