పాలతో పాటు కొన్ని రకాలైన ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నారింజ, ద్రాక్ష, ఇతర సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. వీటిని పాలతో తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది. అలాగే సిట్రస్ బెర్రీలు లేదా సిట్రస్ రేగు పండ్లు వంటివి జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తాయి. చేపలు, పాలను కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం లేదా ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతుంది.