ఆరెంజ్ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు నారింజ తినటం వల్ల ఛాతీ, కడుపులో మంట ఎక్కువవుతుంది. అలాగే దంతాల సమస్య ఉన్నావారు, పొత్తికడుపు నొప్పి ఉన్నవారు ఆరెంజ్లు తినకపోవటం మంచిది. పొట్ట సమస్యలు ఉన్నవారు కూడా నారింజ తినకూడదు.