ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త తెలిపింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అలాగే ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం.. 500 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. 90 రోజుల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయాలి. అలాగే ఏడాదిలో మూడువేల వీక్షణలు, చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ అర్హత సాధించిన వాళ్లు మానిటైజేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.