ప్రస్తుత రోజుల్లో గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరిలోనూ సాధారణంగా కనిపిస్తోంది. ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం, సోడాలను తాగడం, పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్ గమ్ అదే పనిగా నమలడం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు జున్ను, పాలు, గుడ్డు సొన వంటి ఆహారాలను తక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే పిండిపదార్ధాలు అధికంగా ఉండే బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ, బ్రెడ్ వంటివి గ్యాస్ సమస్యలను మరింత రెట్టింపు చేస్తాయంటున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ సమస్యను కొంత అధిగమించవచ్చంటున్నారు.