అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం చెడిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ విషయం తెలిసినా చాలా మంది మద్యాన్ని సేవిస్తుంటాయి. అయితే మద్యం తాగినా కాలేయం పాడవకూడదనుకుంటే ఈ పని చేయండి. లివర్‌ను క్లీన్ చేయడానికి నిమ్మగింజలు ఎంతగానో దోహదపడతాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. నిమ్మ గింజల్లో ఆల్కలాయిడ్స్, టానిన్స్, ప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి లివర్ ఎంజైమ్స్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఫలితంగా కాలేయంలోని విష పదార్థాలు, కొవ్వును బయటకు పంపిస్తుంది.