చాలా మందికి చక్కెరతో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధిక రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అదే నెల రోజులు చక్కెర తినకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? హెల్త్ లైన్ ప్రకారం.. నెల రోజులపాటు చక్కెర తినకపోతే అది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కేవలం సహజసిద్ధంగా దొరికే చక్కెరను అందించే ఆహారాన్ని తీసుకోవాలి.