దేశమంతా జగన్నాథ స్వామి ఆలయాల్లో కోలాహలం నెలకొంది. మంగళవారం జగన్నాథుని రథయాత్ర నిర్వహించనుండటంతో భక్తులు తండోపతండాలు ఆలయాలకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ సముద్రం తీరం వద్ద ఓ అద్భుతాన్ని సృష్టించాడు. పూరీ బీచ్లో జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. రకరకాల రంగులను, 250 కొబ్బరి కాయలను ఉపయోగించి సైకత శిల్పాన్ని తయారు చేశాడు. ఈ శిల్పం పలువురిని ఆకట్టుకుంటోంది.