విటమిన్ బీ 12 మన శరీరానికి అత్యవసరం. కావాల్సింది తక్కవ మోతాదులోనే అయినా చాలా అవసరం. శాఖాహారం, మాంసాహారంలోనూ లభ్యమయ్యే ఈ విటమిన్ శరీరానికి ఎంతో అవసరం. ఇది లేదంటే అనేక అనారోగ్యాలు వేధిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రోజూ 2.4 మైక్రోగ్రాముల బీ 12 విటమిన్ శరీరానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల జీవన నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు పేర్కొన్నారు. నీరసం, గందరగోళం, జ్ఞాపకశక్తి లోపించడం, నిరాశ తదితర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆపిల్, అరటి పండు, బ్లూ బెర్రీ, ఆరెంజ్ వంటి పండ్లు, పాలు, పాల పదార్థాలలోనూ విరివిగా విటమిన్ బీ 12 ఉంటుంది.