కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను తెలుగుతోపాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎన్ఐటీ, ఐఐటీలు మినహా దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహణపై సాధ్యాసాధ్యాలను 5 నెలల్లో నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి అప్పగించింది. పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్ కోర్సును రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఐఐటీ హైదరాబాద్ నివేదిక సమర్పించనుంది.