సాధారణంగా గర్భిణీలు కుంకుమ పువ్వు తినాలంటారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే పిల్లలు అందంగా, మంచి రంగుతో పుడతారని చాలామంది నమ్మకం. మరికొంతమంది కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎరుపురంగులో పుడతారని చెబుతుంటారు. అయితే మనం తినే ఆహారం బట్టి పిల్లల రంగులో ఎలాంటి మార్పు రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం భార్యాభర్తల జీన్స్పైనే పిల్లల రంగు ఆధారపడి ఉంటుందట. కుంకుమ పువ్వు తిన్నంత మాత్రాన పిల్లలు ఎరుపు రంగులో పుట్టరని తెలిపారు.