వర్షాకాలంలో కొన్ని కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. టమాటను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల ఉత్పత్తి తగ్గుతుంది. వర్షాకాలంలో కాకరకాయ తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. కాకరకాయలో ఉండే యాంటీవైరల్ గుణాలు వర్షం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను తరిమికొడతాయి. వర్షాకాలంలో పొట్లకాయ తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. పొట్లకాయలో ఐరన్, విటమిన్ బి, సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి.