వర్షాకాలంలో ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి వీటిని గాలి తగిలే ప్రవేశంలో నిల్వ ఉంచాలి. కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఉల్లి, ఆలూ త్వరగా మొలకెత్తవు. అయితే ఉల్లి, ఆలూను నిల్వ చేసేటప్పుడు విడిగా ఉంచాలి. ఒకే చోట రెండింటిని కలపకూడదు. అలాగే ఫ్రిజ్‌లో కూడా పెట్టకూడదు. గాలి, వెలుతురు తగిలే ప్రదేశంలో వీటిని నిల్వ ఉంచాలి. అధిక వేడి, చల్లదనం ఉండే చోట వీటిని నిల్వ ఉంచరాదు. అప్పుడే ఎక్కువ రోజులు వీటిని నిల్వ ఉంచగలము.