తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దోస్త్ ప్రవేశాల షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26న కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాలని సూచించింది. కాలేజీలో వేరే బ్రాంచ్ లో చేరాలనుకునేవారికి ఈ నెల 28 నుండి 31 వరకు ఇంట్రా కాలేజ్ ప్రక్రియ ఉంటుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa