దేశంలో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే 7 శాతం బంగారం అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 170.7 టన్నులుగా ఉంటే. ఈసారి 158.1 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) తాజాగా వెల్లడించింది. విలువపరంగా పోయినసారి రూ.82,530 కోట్లుగా, ఈసారి రూ.79,270 కోట్లుగా ఉన్నట్టు తమ తాజా నివేదికలో డబ్ల్యూజీసీ తెలియజేసింది.