వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనే ఆలోచనే లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చికెన్ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
![]() |
![]() |