వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే ముక్కు దిబ్బడ, గొంతు పూడుకు పోవడం, శ్వాస ఇబ్బందులు పోతాయి. చలి, వణుకు లాంటివి తగ్గిపోతాయి. వెచ్చటి నీళ్లతో కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. మలబద్ధక సమస్య కూడా పోతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలో మలినాలన్నీ తొలగిపోతాయి. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసి తాగితే బరువు తగ్గొచ్చు.