కళ్ల కలక వ్యాధిపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యాధి గురించి వివరించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారిణి డాక్టర్ చిక్కాల లక్ష్మీ సుధ అన్నారు. ఆదివారం కొల్లిపర మండలం మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి, ఏఎన్ఎంలకు కళ్లకలక పై అవగాహన కల్పించారు. దుమ్మూ, ధూళి, వేడి, వల్ల కంటిలో ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా కళ్లకలక వస్తుందన్నారు.