ప్రస్తుత రోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్లు తక్కువ లేదా అధికంగా ఉత్పత్తి కావడంతో ఈ సమస్య వస్తుంది. సరైన ఆహారంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాపిల్స్ తినడం వల్ల శరీరం డీటాక్సిఫై అయ్యి, థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన బెర్రీస్ తింటే కూడా థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండి ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.