ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను ఆ దేశం వెనక్కి పంపించింది. అవగాహన లేని విద్యార్థులు వాట్సాప్, ఈ-మెయిల్స్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ కోసం ఆరా తీస్తున్నారని, వాట్సాప్ అకౌంట్లపై యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిఘా ఉంటుందని NRIలు పేర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి ఎక్కువ డబ్బులు జమ అయినా నిబంధనల ప్రకారం విద్యార్థులను వెనక్కి పంపిస్తారని వారు చెబుతున్నారు.