చిన్న పిల్లలు ఆహారం తినడానికి చాలా మారాం చేస్తుంటారు. ఆర్నెళ్ల తర్వాత పిల్లలకు దవడలు కాస్త బలోపేతం అవుతాయి. అప్పటినుంచే ఆహారం నములుతూ తింటారు. సరైన సమయంలో పిల్లలకు ఆహారం ఇస్తే పెద్దయ్యాక గుండె వ్యాధులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటివి దరిచేరవు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆహారంపై ఆసక్తి కలిగించాలి. చిన్నారులు కొత్త వాటిని తినడానికి పిల్లలు జంకుతారు. వీలైనంత వరకు కొత్త పదార్థాలను చూపిస్తూ ఉండాలి.