గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గడంతో పాటు శరీరానికి కూడా ప్రయోజనాలున్నాయి. తలనొప్పితో ఇబ్బంది పడేవారు గోరింటాకును తలకు పట్టిస్తే మంచి ఉపశమనం ఉంటుంది. ఈ ఆకులు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గడంతో పాటు నోటి పూత పోతుంది. గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి తాగితే కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. గోరు పుచ్చి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే గోరింటాకు పెట్టుకోవాలి.