సొరకాయ తింటే డీహైడ్రేషన్ అదుపులో ఉంటుంది. సొరకాయలో కెలొరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు సొరకాయను తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఇందులో శాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ ఇందులో ఉండవు. సొరకాయలో ఉండే విటమిన్ సి, రైబోఫ్లెవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. సొరకాయలోని పొటాషియం మెదడుని ఉత్తేజపరుస్తుంది.