ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న యువకులపై దాడిని ఖండిస్తూ గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన కిషోర్, రమేష్ లు రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో చెరువు వద్ద మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అనుమతులు లేకుండా ఎందుకు మట్టి తవ్వుతున్నారని ప్రశ్నించగా.. అక్కడే ఉన్న చిన వెంకన్న ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ మానుకొండ సుబ్బారావు, అతని అనుచరులు కలిసి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.