కొన్ని ఆహార పదార్థాల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. అయితే ఎప్పుడూ యంగ్ గా కనిపించాలంటే కొన్ని పదార్థాలను తినాల్సిందే. బొప్పాయి పండులో లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు నుంచి రక్షించుకోవచ్చు. బ్రోకోలీలో విటమిన్ సీ, విటమిన్ కే, ఫొలెట్, కాల్షియం, లుటిన్ వంటి పోషకాల వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పెరుగులో విటమిన్ బి12 కణాల పునరుత్పత్తిని పెంచుతుంది.