ఉదయం నిద్రలేవగానే ముందుగా కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత బరువు చూసుకోవాలి. బరువు తగ్గుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు 2 గ్లాసుల నీళ్లు తాగాలి. దీంతో ఆకలి తగ్గుతుంది. బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం చేయాలి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అల్పాహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మినుములు, పెసర, వేరుశనగ పప్పులతో చేసే పదార్థాలు, గుడ్డు, పెరుగు వంటివి చేర్చుకోండి. మెల్లిగా తినడం అలవాటు చేసుకోండి. సమోసాలు, పకోడీల వంటి నూనె వస్తువులు తినొద్దు.