వర్షాకాలంలో జామ కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. జామను పోషక శక్తిగా పరిగణిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఏ, లైకోపీన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జామలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జామను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.