ఓ గ్రీన్ యాపిల్, కొన్ని బచ్చలి ఆకులు, ధనియాల గింజలు, అల్లం తీసుకుని వాటిని బ్లెండ్ చేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. నిమ్మరసం, నీరు యాడ్ చేస్తే ఇంకా మంచిది. ఇలా తయారు చేసిన గ్రీన్ జ్యూస్ తాగితే శారీరక బలహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడం సహా, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, దీన్ని అధికంగా కాకుండా తగు మోతాదులో తీసుకోవాలంటున్నారు.