1. మీ DNA ని రక్షించుకోండి
మీ వయస్సు పెరిగేకొద్దీ మీ క్రోమోజోమ్‌ల చివరలు చిన్నవిగా మారతాయి. దీనివల్ల మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ జీవనశైలి మార్పులు వాటిని పొడవుగా చేసే ఎంజైమ్‌ను పెంచుతాయి. ఆహారం, వ్యాయామం వాటిని రక్షించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి.
2. గెలవడానికి ఆడండి
80 సంవత్సరాల అధ్యయనంలో మనస్సాక్షికి కట్టుబడి ఉండే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించినట్లు తేలింది. అంటే వారు విషయాలను ఆలోచించి సరైనది చేయడానికి ప్రయత్నిస్తారు. వివరాలపై శ్రద్ద పెడతారు. వారు తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు. బలమైన సంబంధాలు, మెరుగైన కెరీర్‌లకు దారితీసే వాటిని ఎంపిక చేసుకుంటారు.
3. దూమపానం వదిలేయండి
సిగరెట్‌లు మానేయడం వల్ల మీ జీవితాన్ని పొడిగించే అవకాశం ఉంది. మీరు 30 ఏళ్ల వయస్సులో స్మోకింగ్ చేయడం మానేస్తే మీరు పదేళ్లు ఎక్కువగా జీవిస్తారని 50 ఏళ్ల బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. 40, 50 లేదా 60 సంవత్సరాల వయస్సులో ఈ అలవాటును వదలివేస్తే మీరు వరుసగా 9, 6 లేదా 3 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు.
4. అప్పుడప్పుడూ కునుకు తీయడం మీరు ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడగలదనే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా స్నూజ్ చేసేవారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 37% తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం ద్వారా న్యాప్స్ మీ గుండెకు సహాయపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు.
5. మెడిటరేనియన్ డైట్‌ని అనుసరించండి
ఇది పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె మరియు చేపలలో సమృద్ధిగా ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్‌ను పొందే అవకాశాలను తగ్గిస్తుంది. స్థూలకాయం, అధిక రక్త చక్కెర, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
6. ఒత్తిడిని తగ్గించుకోండి
రోజూ యోగా, ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.