బ్లాక్ ఫుడ్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల బియ్యంలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి క్యాన్సర్ తో పోరాడే శక్తినిస్తాయి. నల్లపప్పు (మినుములు)లో ఫైబర్, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఇందులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక నల్ల వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సుగుణాలు యాంటీ క్యాన్సర్ కారకులుగా పనిచేస్తాయి. పుట్టగొడుగులు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.